![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్లంతా కూడా కవర్ సాంగ్స్ లో సోషల్ మీడియా దుమ్ము రేపుతున్నారు. ఇక ఇటు జబర్దస్త్ అటు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తూ మరో వైపు బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన ఫలక్నామ ఫైమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఫైమా లేడీ కమెడియన్స్ లో చెప్పుకోదగ్గ స్థాయికి వెళ్ళింది. లేడీ కమెడియన్స్ లో ఉన్నది రోహిణి, ఫైమా. అలాంటి ఫైమా కూడా ఇప్పుడు ఒక సాంగ్ ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఆ సాంగ్ ప్రోమోని తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది. "కట్టమీద పోతే కళ్యాప చెటు" అనే సాంగ్ ప్రోమోలో ఆమె డాన్స్ ఇరగదీసింది. ఇక ఈ సాంగ్ ని చూపించి దాని మీద రివ్యూ గురించి అటు జబర్దస్త్ జడ్జెస్ ఐన నాగబాబు, ఇంద్రజాని అడిగింది. నాగబాబు ఆ సాంగ్ చూసారు. "ఏంటి ఫైమా గ్లామరొచ్చావ్ ...కాన్ఫిడెన్సే అందం ఫైమా. నువ్వు డాన్స్ బాగా చేస్తావ్. నీ రీల్స్ కూడా చూసా చాలా బాగా వేసావ్ . ఆల్ ది బెస్ట్ . ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావ్ " అని అడిగారు. " ఒక పది రోజుల్లో సర్ " అని చెప్పింది.
ఆ తర్వాత ఇంద్రజ దగ్గరకు వెళ్ళింది. ఈ సాంగ్ చూపించింది. "చాల బాగుంది ఫైమా. ఈ సాంగ్ అద్దిరిపోయింది. అందరూ ఎంజాయ్ చేస్తారు. " అని చెప్పారు. ఇక తాగుబోతు రమేష్ కి కూడా ఈ సాంగ్ చూపించింది. "ఫైమకి నేను పెద్ద ఫ్యాన్ ని. ప్రొఫెషనల్ డాన్సర్ లా చేశావ్. ఫస్ట్ టైం ఇలా సాంగ్ చేయడం చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఎదో ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేస్తావ్ " అంటూ చెప్పుకొచ్చారు. ఇక నెటిజన్స్ ఐతే "ఆల్ ది బెస్ట్..నీ సాంగ్ బాగా వైరల్ కావాలి." అని విష్ చేస్తున్నారు.
![]() |
![]() |